ధర్మారెడ్డికి ధైర్యం చెప్పిన జగన్

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు

Update: 2022-12-22 13:01 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో నంద్యాల జిల్లా పారుమంచాాల గ్రామానికి వెళ్లి ధర్మారెడ్డికి ధైర్యం చెప్పారు.

ఆయన బాధ్యతలను...
చంద్రమౌళిరెడ్డి ఫొటోకు జగన్ నివాళులర్పించే సమయంలో ధర్మారెడ్డి వెక్కి వెక్కి ఏడ్చారు. జగన్ ఆయనను ఓదార్చుతూ ధైర్యాన్ని చెప్పారు. కుటుంబ సభ్యలతో కాసేపు ముచ్చటించారు. కాగా పన్నెండు రోజుల పాటు ధర్మారెడ్డి సెలవు పెట్టారు. ఆయన బాధ్యతలను అనిల్ కుమార్ సింఘాల్ కు అప్పించారు.


Tags:    

Similar News