Andhra Pradesh : వారం రోజులు మాసం విక్రయాలపై నిషేధం
నందిగామ శివారు గ్రామంలో డయేరియా ప్రబలుతోంది
నందిగామ శివారు గ్రామంలో డయేరియా ప్రబలుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డయేరియా కేసులు ఎక్కువ కావడంతో మున్సిపల్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నీటిని పరీక్షల కోసం పంపారు. అనేక మంది డయేరియాతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన అధికారులు చర్యలు ప్రారంభించారు.
నందిగామ శివారు గ్రామంలో...
కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే బయట తిండ్లు తినవద్దని చెబుతున్నారు. కలుషిత నీటిని వల్లనే డయేరియా వ్యాప్తి చెందినట్లు తెలిపారు. మొత్తం మునిసిపాలిటీ పరిధిలో వారం రోజుల పాటు మాంసం విక్రయాలు, వినియోగాన్ని నిషేధిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.