పవన్ శాఖకు అవార్డులు.. రివార్డులు

పంచాయతీరాజ్ శాఖ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

Update: 2026-03-31 07:44 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాలు ప్రకటించారు. అందులో ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు మరోసారి ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. పంచాయతీరాజ్‌ శాఖలో రెండు విభాగాల్లో ప్రథమ పురస్కారం, ఒక విభాగంలో ద్వితీయ పురస్కారం, మరో రెండు విభాగాల్లో తృతీయ పురస్కారం లభించాయి.

దేశంలోనే ప్రధమ స్థానంలో...
వివిధ విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ చోటు సంపాదించింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌లో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలిచింది. వైఎస్సార్​సీపీ హయాంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ, నేడు దేశంలోనే తొలి స్థానానికి చేరింది. జల్‌ సంచయ్‌ - జన్‌ భాగీదారిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్​ ప్రథమస్థానంలో నిలించింది. గతేడాది కూడా పంచాయతీరాజ్​ పలు జాతీయ పురస్కారాలు దక్కించుకుంది.


Tags:    

Similar News