Rain Alert : పండగ పూట కూడా వరద నీరు పలకరించక తప్పదా?

Rain Alert : పండగ పూట కూడా వరద నీరు పలకరించక తప్పదా?

Update: 2025-09-30 04:24 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో పాటు మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో వానలు ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. రుతుపవనాలు తిరోగమన దశలో వర్షాలు కురియడం సర్వసాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టంబరు నెలలో భారీ వర్షాలు పడ్డాయి. ఇక కొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

నాలుగు రోజుల పాటు తెలంగాణలో...
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, వరంగల్ , మహబూబాబాద్, ఖమ్మం, కొత్త గూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శఆఖ తెలిపింది. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
మత్స్యాకారులు చేపలవేటకు...
అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంట ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తెలిపింది. వచ్చే నెల ఒకటోతేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, అయితే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో బ్యారేజీ గేట్లను తెరిచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పెనుముడి పల్లెపాలెంలోకి వదర నీరు చేరింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Tags:    

Similar News