మోదీకి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Update: 2025-09-17 04:48 GMT

ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మన అదృష్టం అని అన్నారు. దృఢ సంకల్పంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని చంద్రాబు కొనియాడారరు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ఆయన చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణ అని చంద్రబాబు పేర్కొన్నారు.

దేశాన్నిముందుకు నడిపిస్తూ...
ప్రజలు, దేశ శ్రేయస్సు పట్ల ఉన్న నిబద్ధత ఎందరో జీవితాలను ప్రభావితం చేసింది - అంకితభావంతో ఆయన మన ప్రపంచ స్థాయిని బలోపేతం చేశారని చంద్రబాబు అన్నారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి లక్ష్యంతో ఆయన పనిచేస్తున్న తీరు అందరి రాజకీయ నేతలకు ఆదర్శనమని ప్రశంసించారు. ఆరోగ్యం, అపరిమిత శక్తితో మాతృభూమికి మోదీ మరింత సేవ చేయాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News