ఏపీకి మరో ఝలక్ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఏపీకి రైల్వే జోన్ ఇచ్చే అవకాశం లేదు.

Update: 2021-12-08 12:24 GMT

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఏపీకి రైల్వే జోన్ ఇచ్చే అవకాశం లేదు. కొత్త రైల్వే జోన్ లు ఏర్పాటు చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఒక పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం 17 రైల్వే జోన్లు ఉన్నాయని, కొత్త జోన్లను ప్రకటించే అవకాశం లేదని ఆయన తెలిపారు.

గతంలో సానుకూలంగా....
విశాఖ రైల్వే జోన్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ విన్పిస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీని సాధ్యాసాధ్యాలపై ఓఎస్డీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వానికి నివేదిక కూడా ఓఎస్డీ నుంచి అందింది. కానీ తాజాగా పార్లమెంటులో మంత్రి ప్రకటనతో విశాఖ రైల్వే జోన్ అటకెక్కినట్లేనని తెలుస్తోంది.


Tags:    

Similar News