జగన్ సర్కార్ ను కూల్చేస్తామన్న ఉద్యోగ సంఘాల నేత
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసులు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసులు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేయగలరని హెచ్చరించారు. ఏపీలో మొత్తం 13 లక్షల మంది ఉద్యోగులున్నారని, మొత్తం ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి 60 లక్షల ఓట్లు ఉంటాయని తెలిపారు. ఈ ఓట్లతో ప్రభుత్వాన్ని కూల్చివేయవచ్చని బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబుకే తెలుసు....
ఉద్యోగుల సమస్యలు ఒక్క చంద్రబాబుకు మాత్రమే తెలుసునని చెప్పారు. ఉద్యోగులకు కనీసం జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. తమ డిమాండ్లను ఉద్యమం ద్వారానే సాధించుకుంటామని చెప్పారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని, అందుకే మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ లో విజయమని బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.