మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌

ఏపీ రైలు ప్రమాదం విషాదంగా మారింది. కొద్దిసేపట్లోనే గమ్యస్థానానికి చేరుకుంటున్న రైలు ప్రయాణికులకు మృత్యురూపంలో కబలించింది. విజయనగర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరికి కలచివేసింది.

Update: 2023-10-30 03:03 GMT

ఏపీ రైలు ప్రమాదం విషాదంగా మారింది. కొద్దిసేపట్లోనే గమ్యస్థానానికి చేరుకుంటున్న రైలు ప్రయాణికులకు మృత్యురూపంలో కబలించింది. విజయనగర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరికి కలచివేసింది. విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్‌ దగ్గర రెండు రైళ్లు

ఢీకొన్నాయి. రాయగాడ ప్యాసింజర్‌ను వెనుక నుంచి పలాస రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే సిగ్నల్‌ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్‌ ఢీకొంది. పట్టాలు తప్పిన విశాఖ- రాయగడ ప్యాసింజర్‌ ఏడు బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. సుమారు 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖపట్నం, విజయవాడ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్‌ 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ప్రకటించారు.

ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై మోడీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. ప్రమాదంపై సీఎం జగన్‌తో మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ మాట్లాడారు.

Tags:    

Similar News