Pawan Kalyan : నేడు కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలోని కొబ్బరి చెట్లను పరిశీలించనుున్నారు. అనంతరం రైతులతో పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు దిబ్బతినడంతో రైతులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు.
పల్లె పండగ కార్యక్రమంలో...
అనంతరం శివకోటిలో పల్లెపండగ 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఉదయం బయలుదేరి 10.15 గంటల నుంచి 11 గంటల వరకూ కేశనపల్లిలో రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం శివకోటికి చేరుకుని పల్లెపండగ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు పవన్ కల్యాణ్ చేరుకోనున్నారు.