Nara Lokesh : ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు
TET exam results 2024
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోనున్న లోకేష్ సాయంత్రం పలువురు ఎన్డీయే కీలక నేతలను కలవనున్నారని తెలిసింది. ఎన్డీయే లో కీలక భాగస్వామి గా ఉన్న టిడిపి పలు రాజకీయ అంశాల పై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు లోకేష్ ఢిల్లీ పర్యటన ఉంటుందని తెలిసింది.
పార్టీ పెద్దలను కలసి...
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఢిల్లీలో పెద్దలను కలసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరనున్నారు. అయితే ఎవరెవరు నేతలను కలుస్తారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. టీడీపీ పార్లమెంటు సభ్యులను కూడా లోకేష్ కలిసే అవకాశముంది. రేపు ఢిల్లీ నుండి అమరావతికి నారా లోకేష్ తిరిగి రానున్నారు.