Breaking : ఏపీ మండలి ఛైర్మన్ కు నాలుగు వారాల గడువు

వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది

Update: 2025-11-27 06:15 GMT

వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. తాను రాజీనామా చేసినా ఇంత వరకూ మండలి ఛైర్మన్ ఆమోదించలేదంటూ జయమంగళ వెంకట రమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే నేడు తీర్పు చెప్పింది.

జయమంగళ వెంకటరమణ రాజీనామాపై...
జయమంగళ వెంకటరమణ రాజీనామాపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు మండలి ఛైర్మన్ ను ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే మండలి ఛైర్మన్ తన రాజీనామాను ఆమోదించలేదని జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆదేశించారు.


Tags:    

Similar News