Andhra Pradesh : హైకోర్టులో నేడు రెండు కీలక కేసుల విచారణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు రెండు కీలక కేసులకు సంబంధించి క్వాష్ పిటీషన్లపై విచారణ జరగనుంది

Update: 2025-05-01 04:37 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు రెండు కీలక కేసులకు సంబంధించి క్వాష్ పిటీషన్లపై విచారణ జరగనుంది. సినీనటుడు పోసాని కృష్ణమురళి క్వాష్ పిటీషన్ ను నేడు విచారించనుంది. గుంటూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.

పీఎస్ఆర్ ఆంజనేయులు కేసు...
అలాగే మరో కీలక కేసు లో కూడా క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ముంబయి నటిని వేధించిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని పిటీషన్ వేశారు. దీనిపై కూడా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో రెండు కేసులు కీలకం కావడంతో ఆసక్తి నెలకొంది.


Tags:    

Similar News