Andhra Pradesh : వాహనమిత్ర పథకానికి అర్హులు వీరే.. నగదు జమ అక్టోబరు 1న

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అందించేందుకు సిద్ధమయింది. ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-09-14 02:24 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని అందించేందుకు సిద్ధమయింది. ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల 1వ తేదీన అందరి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ , మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్థికసాయాన్ని వాహనమిత్ర పథకం కింద పదిహేను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్న ఆటో డ్రైవర్లకు కొంత ఊరట కలిగించే విషయం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అనేక ప్రాంతాల్లో ఆందోళనలు దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాహనమిత్ర పథాకాన్ని దసరాకు అందచేస్తామని ప్రకటించారు.

ఏడాదికి పదిహేను వేలు...
అయితే ఇందుకోసం ప్రభుత్వం మార్గదర్శకాలను వడుదల చేసింది. బీమా, ఫిట్ నెస్ సర్టిఫికెట్ తో పాటు వివిధ రిపేర్ల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అందచేస్తుంది. గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇవ్వగా, కూటమి ప్రభుత్వం మాత్రం పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఇవ్వాలని నిర్ణయించింది.ఇటీవల సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభను అనంతపురంలో నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం ఎప్పుడు ఇచ్చేది ప్రకటించారు. దసరాకు అని చెప్పారు. అయితే తాజాగా ఈ పథకం అక్టోబరు 1వ తేదీన నిధులు వారి ఖాతాల్లో విడుదల చేయనున్నారు. వాహనమిత్ర కోసం అందరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విధానం ఇదీ...
దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ నాటికి వాహనాల జాబితాతో పాటు రిజిస్ట్రేషన్ నెంబరు, యజమాని పేరు, అడ్రస్, ఫోన్ నెంబరు వంటివి జీఎస్ డబ్ల్యూఎస్కు అందిస్తుంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా 2023 - 2024 ఆర్థిక సాయం పొందిన లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్లడిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేంుదకు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఈ నెల 17వ తేదీన నాటికి ఆన్ లైన్ వేదికను సిద్ధం చేస్తుంది. ఈ నెల 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తి చేసి తుది జాబితా ఈ నెల 24వ తేదీకి సిద్ధమవుతుంది. లబ్దిదారుల జాబితాను కార్పొరేషన్ ల వారీగా జీఎస్ డబ్ల్యూఎస్ విభాగం 24వ తేదీ నాటికి రవాణా శాఖకు పంపుతుంది. అక్టోబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలను జమ చేస్తారు.
మార్గదర్శకాలు ఇవే
01. దరఖాస్తు దారులు ఆంధ్రప్రదేశ్ లో జారీ చేసిన ఆటో రిక్షా, టైమ్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
02. వాహనం కూడా ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి.మోటార్ క్యాబ్, మ్యాచ్ లకు మాత్రం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తో పాటు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉండాలి. ఆటోలు మాత్రం ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకపోయినా అంగీకరిస్తారు. ఒకనెలలోపు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
03. అన్ని ఆటో, రమోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తించినా, తెలుపు రంగు రేషన్ కార్డు విధిగా ఉండాలి
04. ఇంటి విద్యుత్తు వినియోగం మూడు వందల యూనిట్ల కంటే తక్కువ ఉండాలి.
05. వాహనాలకు ఏ విధమైన పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
05. ఆటోలు, క్యాబ్ ల యజమానులకు మాగాణి అయితే మూడు ఎకరాలు, మెట్ట అయితే పది ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే నివాసం కానీ, కమర్షియల్ భవనం కానీ ఉండ కూడదు.







Tags:    

Similar News