Andhra Pradesh : ఈ దసరాకు చంద్రబాబు మరో కానుక.. నిరుద్యోగులకు అసలైన పండగ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించబోతుంది. నిరుద్యోగ భృతి ఈ ఏడాది అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది

Update: 2025-06-26 05:08 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించబోతుంది. నిరుద్యోగ భృతి ఈ ఏడాది అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. తాజాగా మచిలీపట్నంలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేశ్ కూడా నిరుద్యోగ భృతిని ఈ ఏడాది అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకూ వృద్ధులు, వితంతవులకు నాలుగువేల రూపాయల పింఛన్, మహిళల కోసం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం పథకం, తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు. ఈ నెలలోనో వచ్చే నెల మొదటి వారంలోనో అన్నదాత సుఖీభవ పథాకాన్ని అమలు చేయనున్నారు.

మార్గదర్శకాలను...
అన్నదాత సుఖీభవ పథకం ఇచ్చిరైతులను తమవైపు ఉండేలా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని గ్రౌండ్ చేయనున్నారు. ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక నిరుద్యోగుల కోసం ఇప్పటికే మెగా డీఎస్సీని నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు నిధులను రెడీ చేయాలని చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఈ ఏడాది దసరా నాటికి ఈ పథకం గ్రౌండ్ అయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
విధివిధానాలివేనట...
ఇప్పటికే వేద విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప చేసిన ప్రభుత్వం అర్హతలపై కసరత్తులు చేస్తుంది. ఏ డిగ్రీ అయినా పూర్తి చేసి ఏడాదికి పైగానే ఎటువంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్న వారికి ఈ పథకం వర్తించేలా మార్గదర్శకాలు వెలువడే అవకాశముందని చెబుతున్నారు. కనీస విద్యార్హత డీగ్రీ ఉత్తీర్ణత గా చేస్తున్నారు. వారిలో కొందరికి స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలను కల్పించేంత వరకూ నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పథకం కింద అర్హతలు కూడా దాదాపుగా మిగిలిన పథకాలు మాదిరిగానే ఉంటాయని అంటున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు చేయించి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేయాలని భావిస్తుంది. అయితే ఈ పథకం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన వారు భృతిని కోల్పోయే విధంగా కూడా విధివిధానాలను రూపొందిస్తున్నారని సమాచారం.


Tags:    

Similar News