Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆ కులం పేరులో ఆ పదం వాడొద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ ఏ కేటగిరీలోని దాసరి సామాజిక వర్గానికి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2025-06-17 03:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ ఏ కేటగిరీలోని దాసరి సామాజిక వర్గానికి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సామాజిక వర్గానికి ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాలలో 'భిక్షాటన చేసే వారు' అనే పదం రాయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించడంతో, ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ పదం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని వారు భావించి ప్రభుత్వానికి తమ వినతిని అందించారు.

కులధ్రేవీకరణ పత్రాల కోసం..
దీంతో ఇకపై కుల ధ్రువీకరణ పత్రాలలో కేవలం 'దాసరి' అనే పదం మాత్రమే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పు అధికారికంగా అమల్లోకి రావడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. బీసీ కులాల పట్ల గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాసరి వర్గానికి చెందిన ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.


Tags:    

Similar News