Talliki Vandanam : తల్లికి వందనం పథకం అర్హతలివే.. విడుదల చేసిన మార్గదర్శకాలివే

తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది

Update: 2025-06-12 08:15 GMT

కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపయాలకు మించకూడదు, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 రూపాయలకు మించకూడదు.కుటుంబంలో కనీసం ఒకరైనా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే తడి భూమి మూడు ఎకరాల లోపుగా ఉండాలి. పొడి భూమి 10 ఎకరాల లోపుగా ఉండాలి.లేకపోతే తడి + పొడి భూములు కలిపి 10 ఎకరాల లోపుగా ఉండాలి. కుటుంబంలోని ఎవరైనా వ్యక్తి ఫోర్ వీల్ వాహనం అంటే కార్లు, జీపులు కలిగి ఉంటే అర్హత లేదు. అయితే టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయింపు ఇచ్చారు.

విద్యుత్తు వినియోగం...
పన్నెండు నెలల సరాసరి ఆధారంగా, గృహంలో విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి. సొంతఇల్లు అయినా అద్దెకు ఉన్నవైనా సరే నెలకు మూడు వందల యూనిట్ల విద్యుత్తు వినియోగానికి మించకూడదు. కుటుంబం 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ మునిసిపల్ ఆస్తి కలిగి ఉండకూడదు. కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా కేంద్ర ప్రభుత్వంలో గాని, రాష్ట్ర ప్రభుత్వంలో కాని ఉద్యోగం ఉండకూడదు. ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వారు ఉంటే అర్హత లేదు. కానీ పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000 రూపాయల కంటే తక్కువ జీతం పొందే ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల కంటే తక్కువ జీతం పొందేవారు మినహాయింపులోకి రానున్నారు.
ఆదాయం పరిమితి...
కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్నుచెల్లింపు దారు అయితే ఈ పథకం వర్తించదు. లబ్ధిదారుడు పేరుతో కుటుంబ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటాబేస్‌లో ఉండాలి. లేదంటే, విద్యార్థి డేటాబేస్‌లో ఉన్నపక్షంలో GSWS శాఖ వారు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అర్హత నిర్ధారిస్తారు. లబ్ధిదారుని పిల్లలు ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే వారు అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో చదవాల్సి ఉంటుంది. కానీ ఐటీఐ, పాలిటెక్నిక్, ఆర్జేయూకేటీ వంటి కోర్సులు చదివే విద్యార్థులు అర్హులుకారు. అనాథలు, వీధి పిల్లలు వాలంటరీ సంస్థల ద్వారా పాఠశాలలో చేరితే, సంబంధిత శాఖ నిర్ధారణ ఆధారంగా అర్హులవుతారు. తల్లి బ్యాంక్ ఖాతా ఆధార్ NPCI లింకింగ్ పూర్తిగా ఉండాలి. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో 5% అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు వచ్చే సంవత్సరంలో సహాయం కొనసాగుతుంది.కానీ విద్యార్థి మిడిల్‌లో చదువు మానేస్తే లేదా 75% హాజరు లేకపోతే, తదుపరి సంవత్సరానికి అర్హత ఉండదు.


Tags:    

Similar News