విశాఖ, విజయవాడ వాసులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది

Update: 2024-12-17 03:00 GMT

metro trains in hyderabad

విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. విశాఖపట్నంలో లో మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23కిలోమీటర్ల మేర 3 కారిడార్ల నిర్మాణానికి నిర్ణయించింది. మెట్రో లైన్ కారిడార్ 1 కింద విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కి.మీ, కారిడార్ 2: గురుద్వార్ నుంచి పాత పోస్ట్‌ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్లు, కారిడార్ 3: తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ, రెండో దశలో కారిడార్ 4: కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు 30.67కిలోమీటర్ల వరకు మెట్రో లైన్ నిర్మించాలని నిర్ణయించారు.


 విజయవాడలో...

అలాగే విజయవాడలో మొదటి దశలో మెట్రో లైన్ కారిడార్ 1 కింద గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, కారిడార్ 2: పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు రెండో దశలో కారిడార్ 3: పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మెట్రో నిర్మాణానికి ఏపీ కూటమి ప్రభుత్వంగ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విజయవాడ, విశాఖలో ట్రాఫిక్ సమస్యలు తొలగించేందుకు మెట్రో రైలు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. నిజంగా ఇది విశాఖ, విజయవాడ వాసులకు గుడ్ న్యూస్ అని చెబుతున్నారు.


Tags:    

Similar News