Talliki Vandanam Scheme : ఏపీలో తల్లులకు గుడ్ న్యూస్.. రేపు తల్లికి వందనం నిధుల విడుదల
ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు తల్లికివందనం నిధులు విడుదల చేయనుంది
ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు తల్లికివందనం నిధులు విడుదల చేయనుంది. సూపర్ సిక్స్ హామీల అమలో భాగంగా తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయిన సందర్భంగా రేపు తల్లికి వందనం నిధులను విడుల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రేపు ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తుంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లులకు వందనం నిధులను విడుదల చేయనున్నారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం ప్రారంభం కానున్నాయి. ఇందులో 67.27 లక్షల మంది తల్లులు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.
అర్హులను ఎంపిక చేసి...
తల్లికి వందనం పథకం అమలుపై గత కొంతకాలంగా అధికారులు అధ్యయనం చేసి అర్హులను ఎంపిక చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక కుటుంబంలో ఒకరికే అమ్మఒడి పథకం అమలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ అందరికీ విడుదల చేయాలని నిర్ణయించడంతో తల్లులకు ఖుషీ కబురు అని చెప్పాలి. అయితే అడ్మిషన్లు పూర్తయి విద్యార్థుల డేటా అందుబాటులోకి వచ్చిన వెంటనే తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దీనికి సంబంధించిన విధివిధానాలను మాత్రం ఖరారు చేసింది. ప్రభుత్వం ఉత్వర్వులు విడుదలచేయడంతో రేపు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు జమ అవ్వనున్నాయి.
సూపర్ సిక్స్ హామీలు...
ప్రతి విద్యార్థిక ఒకే దఫా ఏడాదికి పదిహేను వేల రూపాయల నిధులను ప్రభుత్వం అందచేయనుంది. దీంతో గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో పింఛన్లను నాలుగు వేల రూపాయలకు వచ్చిన వెంటనే పెంచింది. అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేసింది. దీపం 2 పథకం కింద మహిళలకు ఉచిత సిలిండర్ పథకాన్ని అందచేస్తుంది. నిరుద్యోగులకు మెగా డీఎస్సీ కూడా నిర్వహించారు. ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేయనుంది. ఈ నెలలోనే పీఎం కిసాన్ సమ్మాన్ పథకంతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేయనుంది. దీంతో రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. వరసగా సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ వెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.