Andhra Pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రాత పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-04-24 12:18 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. జూన్ 1వ తేదీన పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్ష ఉంటుందని పరభుత్వం తెలిపింది. రాత పరీక్షను తిరుపతి, కర్నూలు, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

జూన్ 1వ తేదీ...
జూన్ 1వ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ రాత పరీక్షను నిర్వహించనున్నారు. 2023లో జనవరిలో నిర్మహించిన ప్రాధమిక పరీక్షకు మొత్తం 4.59 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా, ఇందులో కేవలం 95,208 మంది మాత్రమే అర్హత సాధించారు. వీరికి మాత్రమే జూన్ 1వ తేదీన రాత పరీక్షను నిర్వహించనున్నారు.


Tags:    

Similar News