Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. విద్యుత్తు ఛార్జీలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్తు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు తెలిపింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్తు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ప్రస్తుతం నలభై పైసల చొప్పున వసూలు చేస్తుంది. సర్దుబాటు ఛార్జీలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి గొట్టి పాటి రవికుమార్ తెలిపారు.
నవంబరు నెల నుంచి...
నవంబరు నెల నుంచి యూనిట్ కు పదమూడు పైసలు తగ్గించనున్నట్లు గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రానున్న రోజుల్లో విద్యుత్తు ఛార్జీల భారం మరింత తగ్గుతుందని ఆయన తెలిపారు. విద్యుత్తు ఛార్జీలు పెంచకుండా వీలైతే తగ్గిస్తామన్న కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకుంటుందని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో విద్యుత్తు ఛార్జీలు మరింత తగ్గుతాయని తెలిపారు.