గురుకులాల్లో చేరే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-03-29 02:56 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలకు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించింది.

దరఖాస్తుల స్వీకరణను...
దరఖాస్తుల స్వీకరణను విద్యార్థుల సౌకర్యార్ధం ఏప్రిల్‌ 6వ తేదీ వరకు పొడిగించినట్లు కార్యదర్శి మస్తానయ్య తెలిపారు. ఆసక్తికలిగిన, అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు https://aprs.apcfss.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ-మెయిల్, పోస్టు ద్వారా పంపించే దరఖాస్తులను పరిశీలించమని ఆయన స్పష్టం చేశారు.


Tags:    

Similar News