Andhra Pradesh : ఏపీలో కొత్త జిల్లాలివే.. అందులో నియోజకవర్గాలివే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ కొన్నిచోట్ల ఇబ్బందులు వచ్చాయి. దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేరే జిల్లాల్లో కలిశాయి. జిల్లా కేంద్రం రావాల్సిన చోట రాకపోవడంతో ప్రజలు నిరసన తెలియజేశారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాల్లో ప్రచారంలో పర్యటిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రజల మనోభావాలకు, సెంటిమెంట్ ను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత....
అనుకున్న మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాల ప్రతిపాదనను రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సభ్యులతో కమిటీని కూడా నియమించారు. త్వరలో ప్రతిపాదనలను పంపాలని కూడా కోరారు. స్థానిక పరిస్థితులు, సెంటిమెంట్, దూరం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కేంద్రాలతో పాటు కొత్త జిల్లాల్లో ఉండే నియోజకవర్గాలతో కూడిన ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రి వర్గ సభ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
జిల్లా కేంద్రాలు.. పేర్లు...
ఈ మేరకు మంత్రి వర్గ సభ్యులు, అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలిసింది. ఇందులో జిల్లా పేర్లను కూడా మారుస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రాలను కూడా ఛేంజ్ చేసే అవకాశముంది. అయితే తాజాగా ప్రతిపాదిత కొత్త జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాలు, అందులో ఉండే నియోజకవర్గాల గురించి అందుతున్న సమాచారం మేరకు ఇలా ఉండే అవకాశముందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అందరూ అంగీకరిస్తే వీటిని ఏపీ ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశముంది. గత ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదనలు మొత్తం 32 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
కొత్త జిల్లాలివే...
1. పలాస జిల్లా: పలాస. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాత పట్నం.2. శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం. శ్రీకాకుళం, అముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం
3. మన్యం జిల్లా: పార్వతీపురం. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ.
4. విజయనగరం జిల్లా: విజయనగరం. విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి.5. విశాఖపట్నం జిల్లా: విశాఖపట్నం. భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తరం, గాజువాక, పెందుర్తి.
6. ఏ.ఎస్.ఆర్ జిల్లా: అరుకు. ఆరుకు, పాడేరు, మాడుగుల
7. అనకాపల్లి జిల్లా: అనకాపల్లి. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, తుని8. కాకినాడ జిల్లా: కాకినాడ. కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణ, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెదపూడి, రామచంద్రాపురం.
9. తూర్పు గోదావరి జిల్లా: రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణ, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం.
10. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం. అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కోటిపల్లి, మండపేట
11. పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరం. నరసాపురం, భీమవరం, తణుకు, ఆచంట, పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెం.
12. ఏలూరు జిల్లా: ఏలూరు. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం.
13. కృష్ణా జిల్లా: మచిలీపట్నం. మచిలీపట్నం, కైకలూరు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, పామర్రు.
14. ఎన్.టి.ఆర్ జిల్లా: విజయవాడ. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం.
15. అమరావతి జిల్లా: అమరావతి రాజధాని సిటీ. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ.
16. గుంటూరు జిల్లా: గుంటూరు. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు.
17. బాపట్ల జిల్లా: బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు.
18. పల్నాడు జిల్లా: నరసరావుపేట. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ
19. మార్కాపురం జిల్లా: మార్కాపురం. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి.
20. ప్రకాశం జిల్లా: ఒంగోలు. ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి, కందుకూరు.
21. శ్రీ పోట్టి శ్రీరాములు జిల్లా: నెల్లూరు. నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణ, కావలి, కోవూరు, ఉదయగిరి.
22. గూడూరు జిల్లా: గూడూరు. గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట.
23. శ్రీ బాలాజీ జిల్లా: తిరుపతి. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి.
24. చిత్తూరు జిల్లా: చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, కుప్పం.
25. మదనపల్లె జిల్లా: మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె.
26. శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం. హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర.
27. అనంతపురం జిల్లా: అనంతపురం. అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి.
28. ఆదోని జిల్లా: ఆదోని. ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం.
29. కర్నూలు జిల్లా: కర్నూలు. కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు.
30. నంద్యాలబ జిల్లా: నంద్యాల. నంద్యాల, శ్రీశైలం, ఆళ్ళగడ్డ, బనగానపల్లె, పాణ్యం.
31. వై.ఎస్.ఆర్ కడప జిల్లా: కడప. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల.
32. అన్నమయ్య జిల్లా: రాజంపేట. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, బద్వేల్.