అంగన్ వాడీతో చర్చకు ప్రభుత్వం సిద్ధం
గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలకు పిలిచింది
andhra pradesh government has called the anganwadi workers
గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. సాయంత్రం 4.30 గంటలకు మంత్రి వర్గం ఉపసంఘంతో చర్చించాలని అంగన్ వాడీ సంఘాలకు ఆహ్వీనం పలికింది. గత పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.
డిమాండ్ల పరిష్కారం కోసం...
తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు సమ్మె చేస్తున్నారు. జీతాలు పెంపుదలతో పాటు పలు ఆర్థికపరమైన డిమాండ్లు కూడా అందులో ఉన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష‌్కరించిందని, మరికొన్ని సమస్యలను పెండింగ్‌లో ఉన్నాయని అంగన్ వాడీ వర్కర్ల సంఘాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో ఆర్థికపరమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.