మురళీనాయక్ కుటుంబానికి పవన్ భారీ సాయం

వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం భారీగా ఆర్థిక సాయం ప్రకటించింది.

Update: 2025-05-11 07:42 GMT

వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం భారీగా ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి 50 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. వారికి ప్రభుత్వం తరఫున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

వ్యక్తిగతంగా...
జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ఐదెకరాల భూమితో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తా పవన్ హామీ ఇచ్చారు.


Tags:    

Similar News