వామ్మో.. అరుదైన చేప తెచ్చిన తంటా ఎంటో తెలుసా?.. చివరికి..

ఏపీలో ఓ రైతులకు వింత అనుభవం ఎదురైంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేట సమీపంలో..

Update: 2023-09-20 03:45 GMT

ఏపీలో ఓ రైతులకు వింత అనుభవం ఎదురైంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేట సమీపంలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు బయలుదేరాడు. పొలంలోకి వెళ్లిన రైతుకు ఓ అరుదైన ప్రాణి కనిపించింది. ఇది మడ్డువలస రిజర్వాయర్ నుంచి పొలంలోకి వస్తున్న నీటిలో ఈ పొడవాడి ప్రాణి పాకుతూ వచ్చింది. దానిని చూసిన సదరు రైతు ఏదో ప్రమాదకరమైనది అనుకుని భయంతో పరుగులు తీశాడు. తర్వాత కొద్దిసేపటికి మరోసారి దాని వద్దకు వచ్చాడు ఆ రైతు. తర్వాత ఏం చేయలో తెలియక పెద్దగా కేకలు వేశాడు. ఈ రైతు కేకలు విన్న పక్కపొలంలోని రైతులు పరుగున వచ్చారు. అందరూ కలిసి పొలంలోనే ఆ ప్రాణి వద్దకు చేరుకొని పొడవుగా, లావుగా ఉన్న ఈ ప్రాణి అరుదైన జాతి గల పాము అని భావించారు. దీంతో వెంటనే కర్రలతో ఆ ప్రాణిని కొట్టారు. రైతులు కొట్టిన దెబ్బలకు కదల్లేక పోయింది ఆ ప్రాణి. ఆ తరువాత అందరూ కలిసి నెమ్మదిగా ప్రాణిని కర్రతో కదిలించగా అక్కడ కనిపిస్తుంది పాము కాదని, అరుదైన చేప అని నిర్ధారణకు వచ్చారు. ఆ చేప సుమారు ఐదు అడుగుల పొడవు, ఇరవై ఆరు కిలోల వరకు బరువు ఉందని భావించారు ఆ రైతులు. అయితే ఇక్కడే పెద్ద సమస్యల వచ్చి పడింది.

రైతు చేతికి దొరికిన చేపను తాము కూడా చూశామని, మడ్డువలస రిజర్వాయర్ నుండి నీటిలో కొట్టుకువచ్చింది కాబట్టి అందరికి ఆ చేపలో వాటా ఉంటుందని రైతుతో గొడవకు దిగారు మిగతా రైతులు. పొలంలో నాకు దొరికిన చేపలో మీకెందుకు వాటా ఇవ్వాలని రైతు కూడా వారితో గొడవకు దిగాడు. ఇంకేముంది చిలికి చిలికి గాలి వానలా మారిందన్నట్లు ఈ చేప పంచాయితీ కాస్తా గ్రామంలోని పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఇరు వర్గాల వాదనలు విని ఎట్టకేలకు చేప రైతు పొలంలో దొరికింది కాబట్టి రైతుకు చెందిందని తీర్పు ఇచ్చారు గ్రామ పెద్దలు. హమ్మయ్య నా చేప నాకు దక్కింది ఆ రైతు సంబరపడ్డాడు. తర్వాత దానిని ఇంటికి తీసుకెళ్లాడు. కానీ సమస్య సద్దుమణిగి ఇంటికి చేరుకున్న ఆ రైతుకు మరో సమస్య వచ్చి పడింది.
అరుదైన చేప విషపూరితం అయ్యిందని కొందరు, లేదు లేదు మడ్డువలస రిజర్వాయర్ లో పెరిగిన చేప కాబట్టి శ్రేష్టమైన చేపే అని మరికొందరు ఇలా ఎవరికి వారు చేప కోసం అనుమానాలు వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఈ అనుమానాలు విన్న రైతు భార్య ఇదేదో ప్రమాదకరమైన చేపలా ఉంది.. చేపకి విషం ఉంటే ఇంట్లో వారందరికీ హని కలుగుతుంది.. కూర వండనంటూ తెగేసి చెప్పింది. అలా ఇంట్లో రైతు తన భార్యతో మళ్ళీ కొంతసేపు గొడవకు దిగాడు. చివరికి రైతు గొడవతో చేసేదిలేక ఎట్టకేలకు చేపను కోసి చేపపులుసు పెట్టింది రైతు భార్య. చివరికి అందరు హాయిగా తినేశారు. కానీ పొలంలో దొరికి చేపతో ఎన్ని తంటాలు వచ్చి పడ్డాయో. దాని తీనేందుకు పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చిందంటూ ఆ రైతు చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News