Pawan Kalyan : నేడు పిఠాపురానికి పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు

Update: 2025-10-09 02:58 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు పవన్ కల్యాణ్ వెళతారు. అక్కడ నుంచి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళతారు. అక్కడ మత్స్యకార సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. పరిశ్రమల వల్ల సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని మత్స్యకారులు ఆందోళనకు దిగడంతో తొలుత వారితో సమావేశమై చర్చిస్తారు. సమస్యపై అధికారులతో మాట్లాడతారు.

మత్స్యకారులతో సమావేశం...
మత్స్యకారులతో సమావేశం ముగిసిన అనంతరం స్థానిక జనసేన నేతలతో సమావేశమవుతారు. అనంతరం ఉప్పాడ చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం పర్యటనకు బయలుదేరి వెళతారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసేన నేతలను కూడా అనుమతిచ్చిన వారికే ప్రవేశం ఉంటుంది. ప్రధానంగా మత్స్యకారుల సమస్యపై తాను వస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఈ మేరకు వారితో సమావేశమయ్యేందుకు ఇక్కడకు వస్తున్నారని జనసేన నేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News