Pawan Kalyan : రేపు పిఠాపురానికి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన వివరాలు తెలిపింది. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల...
ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా పవన్ కల్యాణ్ తెలుసుకుంటారు. సముద్ర జలాలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని... ఆ ప్రాంతం పరిశీలించేందుకు సముద్రంలో ప్రయాణించనున్నారు. ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇటీవల ఉప్పాడ మత్స్యకారులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తాను స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది.