Pawan Kalyan : అమ్మవారికి 22 చీరలు పంపిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం దసరా ఉత్సవాలకు అమ్మవారికి చీరలు పంపారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం దసరా ఉత్సవాలకు అమ్మవారికి చీరలు పంపారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలోని రాజరాజేశ్వరి అమ్మవార్లకు ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు చేస్తారు. పదోశక్తి పీఠమైన పూరుహుతిక అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు.
పిఠాపురంలోని అమ్మవారికి...
అయితే అమ్మవారికి అలంకరించే చీరలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పంపారు. పదకొండు రోజుల పాటు అమ్మవారికి అలంకరింప చేయడానికి ఇరవై రెండు చీరలు పంపారు. ఈ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఒకరోజు పవన్ కల్యాణ్ ఈ ఆలయానికి వచ్చే అవకాశముందని, అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు.