జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేటి కడప జిల్లా పర్యటన రద్దయింది. జగన్ కాలు స్వల్పంగా బెణకడంతో ఆయన పర్యటన రద్దయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేటి కడప జిల్లా పర్యటన రద్దయింది. జగన్ కాలు స్వల్పంగా బెణకడంతో ఆయన పర్యటన రద్దయింది. ఉదయం ఎక్సర్‌సైజ్ చేస్తుండగా కాలు బెణకడంతో ఆయన దానిని తేలిగ్గా తీసుకున్నారు. సాయంత్రానికి కాలు నొప్పి పెరగడంతో జగన్ ఇబ్బంది పడుతున్నారు.
కాలు బెణికి...
గతంలోనూ కాలు బెణికి జగన్ ఇబ్బంది పడ్డారు. నిజానికి ఈరోజు ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరాముల వారికి పట్టు వస్త్రాలను జగన్ ముఖ్యమంత్రి హోదాలో సమర్పించాల్సి ఉంది. అయితే వైద్యుల సూచనల మేరకు ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఈరోజు ఒంటిమిట్టకు జగన్ రావడం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.