15న కడపలో స్టీల్‌ఫ్యాక్టరీ శంకుస్థాపన

ఈనెల 15 న వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు

Update: 2023-02-13 02:26 GMT

ఈనెల 15 న వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు వెల్లడించారు. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీకి స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

త్వరితగతిన పనులు...
అయితే దీని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ నెల 15న పూర్తి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా త్వరితగతిన ఫ్యాక్టరీ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News