నేడు బెజవాడలో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.

Update: 2023-04-17 01:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. వన్‌ టౌన్‌ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.45 గంటలకు విద్యాధరపురం మినీ స్టేడియానికి జగన్ చేరుకుంటారు

ఇఫ్తార్ విందులో...
సాయంత్రం ఐదుగంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకూ వైఎస్ జగన్ ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటన కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News