6న చిలకలూరిపేటకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 6వ తేదీన చిలకలూరపేటలో పర్యటించనున్నారు
ys jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 6వ తేదీన చిలకలూరపేటలో పర్యటించనున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అధికారికంగా సీఎం జగన్ ప్రారంబించనున్నారు. చిలకలూరిపేట మండలం తింగంగుంట్ల గ్రామంలో ఆయన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
దీనిపై ఏర్పాట్లను...
దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ పరిశీలించారు. జగన్ తమ నియోజకవర్గానికి వస్తుండటంతో పెద్దయెత్తున జనసమీకరణ చేయడానికి యత్నిస్తున్నారు. పోలీసులు కూడా పెద్దయెత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఇటు మంత్రి విడుదల రజనీ, అటు కొత్తగా ఎమ్మెల్సీ అయిన మర్రి రాజశేఖర్‌లు పోటీ పడి తమ కార్యకర్తలను కార్యక్రమానికి తీసుకు వస్తున్నారు.