15న చిలకలూరిపేటకు జగన్

ఈ నెల 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Update: 2023-03-07 02:57 GMT

ఈ నెల 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించేందుకు ఆయన నియోజకవర్గానికి వస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని జగన్ ప్రారంభించనున్నారు.

బహిరంగ సభలో...
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పార్టీ నేతలు పెద్దయెత్తున ప్రజలను తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు సమీక్షిస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News