వైఎస్సార్ లా నేస్తం నిధుల విడుదల
నేడు వైఎస్సార్ లా నేస్తం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు.
ys jagan
నేడు వైఎస్సార్ లా నేస్తం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. నేరుగా వారి ఖాతాలోకి నగదును జగన్ జమ చేయనున్నారు. వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఈసారి 2,011 మంది జూనియర్ లాయర్లు లబ్ది పొందనున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
1.55 కోట్లు...
వీరికి 1.55 కోట్ల రూపాయల నిధులను జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. న్యాయవాది వృతి చేపట్టే వారికి ఆర్థికంగా సాయం చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. లా వృత్తికి సంబంధించి పుస్తకాలు తదితరాలను కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతుంది.