589 కోట్లను బటన్ నొక్కి నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఈబీసీ మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఈబీసీ మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఈరోజు జగన్ ప్రారంభిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని మహిళలు, అంటే 45 నుంచి 60 ఏళ్ల మధ్యగల మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద ఒక్కొక్క మహిళలకు ఏడాదికి పదిహేను వేల రూపాయలను ఇవ్వనున్నారు.
ఆర్థికంగా వెనకబడి...
రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమలతో పాటు అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఈ సాయాన్ని అందిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మూడేళ్ల పాటు ఒక్కొక్కరికి నలభై ఐదు వేల రూపాయలను అందిస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే 3.92,674 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈరోజు వీరి ఖాతాల్లో జగన్ 589 కోట్లను జమ చేయనున్నారు.