నేడు గవర్నర్ ను కలవనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలుస్తారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌ఘడ్ కు బదిలీ అయిన సందర్భంగా మర్యాదపూర్వకంగా జగన్ కలవనున్నట్లు తెలిసింది.
నాలుగేళ్లుగా...
గత నాలుగేళ్లుగా బిశ్వభూషణ్ హరిచందన్ తో తనకున్న అనుబంధంతో పాటు కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సజావుగా సాగేందుకు గవర్నర్ అందించిన సహకారంతో ఆయనకు కృతజ్ఞతలు తెలియచెప్పేందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ను కలవాలని నిర్ణయించుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.