విపక్షాలను పట్టించుకోవద్దు...ఓటీఎస్ స్వచ్ఛందమే

వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

Update: 2021-12-08 08:51 GMT

వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఈరోజు గృహనిర్మాణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్ పథకంపై విపక్షాల రాద్ధాంతాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. ప్రతి పధకంలో వారు చేసినట్లుగానే ఇందులో కూడా కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలగచేయాలని చూస్తున్నారన్నారు. వారిని ఎవరినీ పట్టించుకోకుండా ఓటీఎస్ పథకం అమలుపై దృష్టి పెట్టాలని అధికారులను జగన్ ఆదేశించారు.

పేదలపై రుణ భారాన్ని....
పేదల పై పదివేల కోట్ల రుణభారాన్ని తగ్గించే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకు వచ్చామని జగన్ తెలిపారు. రుణాలు మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నామని వివరించారు. ఈ విషయాన్ని లబ్దిదారులకు వివరించాలని జగన్ చెప్పారు. ఓటీఎస్ పథకం ద్వారా సంపూర్ణ హక్కులు దక్కుతాయని అన్నారు. డిసెంబరు 21 నుంచి రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్దిదారులకు అంద చేయడం జరుగుతందని చెప్పారు.


Tags:    

Similar News