Ys Jagan : పులివెందుల చర్చిలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
ys jagan in christmas celebration
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినం రోజున పులివెందుల సీఎస్ఐ చర్చిలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరిన జగన్ 9 గంటలకు పులివెందుల సీఎస్ఐ చర్చికి చేరుకున్నారు.
ప్రత్యేక ప్రార్థనలో...
అనంతరం అక్కడ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చిలో ప్రార్థనల అనంతరం ఆయన మైదుకూరుకు వెళతారు. అక్కడ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కడప జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.