Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలపై సమీక్షల్లో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11.45 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా మైనింగ్ శాఖపై రివ్యూ చేయనున్నారు.
సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో...
అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు సీఆర్టీఏ అథారిటీ సమావేశంలో పాల్గొంటారు. భారీ వర్షాల నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు విజయవాడలో జరిగే వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.