Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలపై సమీక్షలను నిర్వహించనున్నారు. ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న నేతలు, అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు సచివాలయానికి చేరుకుంటారు.
రెవెన్యూ శాఖపై...
ఉదయం 11.30 గంటకు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. నకిలీ స్టాంప్ కుంభకోణం వ్యవహారంపై అధికారులను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు పీ4 పై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. ఇప్పటి వరకూ ఎంత మంది బంగారు కుటుంబాలకు సాయం అందిందన్న దానిపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు