Chandrababu : చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. వివిధ శాఖలపై సమీక్ష ను నిర్వహించనున్నారు. ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. 11.30 గంటలకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పాలసీపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు.
ఉచిత బస్సు ప్రయాణంపై...
మధ్యాహ్నం 12.15 గంటలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై సమీక్ష నిర్వహిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుండటంతో దానికి సంబంధించిన విధివిధానాలను నిర్ణయించే అవకాశముంది. ఉమ్మడి పాత జిల్లాల్లో ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పే అవకాశముంది. సాయంత్రం 06.30 గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.