Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు ఈరోజు సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి...
ఈ సందర్భంగా రేపు కేంద్ర మంత్రులు కొందరిని కలిసే అవకాశం కూడా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఎవరెవరిని కలుస్తారన్నది మాత్రం ఇంత వరకూ క్లారిటీ రాలేదు. వీలయితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో కూడా భేటీ కావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తునట్లు తెలిసింది. మరి వారి అపాయింట్ మెంట్లను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.