Chandrababu : మూడు రోజులు ఢిల్లీలోనే చంద్రబాబు
ఈ నెల 22వ తేదీ ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నారు
ఈ నెల 22వ తేదీ ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. 23వ తేదీ కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలతో పాటు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 24వ తేదీ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో చంద్రబాబు పాల్గొననున్నారు.
పారిశ్రామికవేత్తలతో సమావేశమై
23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామిక వేత్తలతో కూడా సిఎం భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించననున్నారు. 24వ తేదీ ఉదయం 9.30 గంటలకు భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సిఎం చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమై అమరావతి చేరుకుంటారు.