Chandrababu : రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు దంపతులు భేటీ అవుతారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు దంపతులు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.
వచ్చే నెల 2వ తేదీన...
వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారయింది. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన అమరావతికి చేరుకుని రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అయితే మోదీని స్వయంగా కలసి ఆహ్వానించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. స్వయంగా ప్రధానిని అమరావతికి ఆహ్వానించనున్నారు.