Chandrababu : ఏపీని క్రీడా హబ్ ను చేయండి.. కేంద్రమంత్రితో బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు పర్యటనలో నేటి ఉదయం కేంద్ర కార్మిక, క్రీడల శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయాతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సహకరించాలని కోరారు.
అంతర్జాతీయ జల క్రీడలను...
అంతర్జాతీయ జల క్రీడలను నిర్వహించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ మంచి ప్రదేశమని తెలిపారు. ఇందుకు ఏపీ ప్రభుత్వంతో కేంద్రం సహకరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు. మధ్యాహ్నం 2.30 గంటలకు జలశక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్ తోనూ, సాయంత్రం 4.30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి ఏడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఐఐ సర్ణాంధ్ర ప్రదేశ్ టాస్క్ ఫోర్స్ నివేదికను విడుదల చేయనున్నారు.