Chandrababu : సీఆర్డీఏపై నేడు చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ సమీక్షల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం విశాఖపట్నంకు బయలుదేరి వెళతారు. ఉదయం 10.30 గంటలకు క్యాంప్ కార్యాలయంలో హార్టికల్చర్, మార్కెటింగ్ పై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. ఉదయం 11.40 గంటలకు సీఆర్డీఏపై సమీక్షను చంద్రబాబు చేయనున్నారు.
మధ్యాహ్నం విశాఖకు...
అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు జరపాల్సిన భూకేటాయింపులతో పాటు నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై కూడా సీఆర్డీఏ అధికారులతో చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ నొవాటెల్ లో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ మడ్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో పాల్గొంటారు. సాయంత్రం 5.45 గంటలకు అమరావతి నివాసానికి చేరుకుంటారు