Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-08-04 03:56 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి చంద్రబాబు నాయుడు రానున్నారు. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11.45 గంటలకు జీఎస్డీపీపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు.

వివిధ శాఖలపై సమీక్ష...
మధ్యాహ్నం 12.45 గంటలకు ఎక్సైజ్ పాలసీపై సమీక్ష నిర్వహించనున్నారు. మద్యం నుంచి వచ్చే ఆదాయంతో పాటు బెల్ట్ షాపులను తీసివేయడంపై అధికారులతో చర్చిస్తారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 06.10 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. 6.30 గంటలకు మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ప్రారంభోత్సవ సభలో పాలొంటారు. తిరిగి రాత్రి 7.45 గంటలకు ఉండవల్లి లోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.


Tags:    

Similar News