Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలు దేరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చేరుకుంటారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొంటారు.
మధ్యాహ్నం నుంచి క్యాంప్ కార్యాలయంలోనే...
అనంతరం మధ్యాహ్నం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయం లో జరిగే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం లో పాల్గొంటారు. వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు పీ4 మార్గదర్శులతో డిన్నర్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.