Chandrabaabu : నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో పాల్గొననున్నారు. ఈ పుస్తకావిష్కరణకు హాజరు కావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా వచ్చి చంద్రబాబు ను ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన ఈరోజు విశాఖకు వెళ్లారు.
నేడు ఢిల్లీకి...
పుస్తకావిష్కరణ కార్యక్రమం పూర్తయిన అనంతరం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఒక టీవీ కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొంటారు. కొందరు కేంద్రమంత్రులను కూడా చంద్రబాబు నేడు కలిసే అవకాశముంది. నిన్న కొందరు కేంద్రమంత్రులను కలసిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించారు. తర్వాత నేరుగా ఆయన బయలుదేరి విజయవాడ చేరుకోనున్నారు.