Chandrababu : నేడు జమ్మలమడుగుకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Update: 2025-08-01 01:56 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఒకటో తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

పింఛన్ల పంపిణీలో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి మాట్లాడనున్నారు. వారి బాగోగులను అడిగి తెలుసుకోనున్నారు. వారికి దక్కుతున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును గురించి ఆరా తీయనున్నారు. అనంతరం వారితో కలసి కాసేపు ముచ్చటించిన అనంతరం ప్రజాదీవెన సభలో కూడా పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.


Tags:    

Similar News